HomeMovie News'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాని ప్రభాస్

‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాని ప్రభాస్

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ మూవీ, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మరొక మూవీ ఇవి రెండూ కూడా సెట్స్ మీద ఉన్నాయి. డిసెంబర్ లో దిరాజా సాబ్ రిలీజ్ కానుండగా వచ్చే  ఏడాది ద్వితీయార్థంలో హను రాఘవపూడి సినిమా రిలీజ్ కానుంది.

మరోవైపు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన తాజా ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా కన్నప్పలో రుద్ర అనే కీలక పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. జూన్ 27న ఈ సినిమా గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన కన్నప్ప టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుని మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాదులో గ్రాండ్ గా జరుగుతోంది. అయితే ఈవెంట్ కి ప్రభాస్ కూడా వస్తారని కొద్దిసేపటి క్రితం వరకు అందరూ అనుకున్నారు.

ఫైనల్ గా ఆయన ఈవెంట్ కి రావట్లేదని తెలుస్తోంది. కానీ ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ కన్నప్ప ఈవెంట్ కి వచ్చినట్లయితే సినిమాకి పబ్లిసిటీ పరంగా మరింత క్రేజీ బజ్ క్రియేట్ అయ్యేది అంటున్నారు విశ్లేషకులు. మరి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరచిన ఈ సినిమా ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో చూడాలి. 

See also  'హరి హర వీర మ'ల్లు' న్యూ రిలీజ్ డేట్ అదేనా ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories